Minister Dharmana Prasada Rao comments: వైసీపీ ప్రభుత్వాన్ని హేళన చేస్తున్న వారిపై తిరగబడాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హజరైయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ హైస్కూల్ లోని పదవ తరగతి విద్యార్థులకు.. ఎగ్జామ్స్ గైడెన్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై మంత్రి ధర్మాన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాల దృక్పథంతో పని చేస్తుందన్న మంత్రి ధర్మాన... కొంతమంది అదే పనిగా సమాజాన్ని తప్పు తోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
సైకోలు ఇలాంటి పనులు చేస్తారా..?: మంత్రి ధర్మాన ప్రసాదరావు - Minister Dharmana Prasada Rao babu
Minister Dharmana Prasada Rao: శ్రీకాకుళం జిల్లాలో విద్యార్ధులకు ఎగ్జామ్స్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమ ప్రభుత్వంపై ఆరోపణలుచేస్తున్నవారిపై మంత్రి ధ్వజమెత్తారు. కొంత మంది తమ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఈ ప్రభుత్వం ఒక విశాల దృక్పథంతో పని చేస్తుంది. కాని కొంత మంది సైకో అని అంటున్నారు. ఎవరైతే సైకో అంటున్నారో వారు సైకోలు. ప్రభుత్వాన్ని, నాయకులను హేళన చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించాలి దేశాన్ని రాష్ట్రాన్ని నడిపించే వారిని మనం గుర్తించాలి. కొందరు నాయకులు పౌరులే వారిని గుర్తించాలి. మనం గుర్తిస్తే చాలు అలాంటి తప్పడు ఆరోపణలు చేసేవారి తోక ముడుస్తారు. ధర్మాన ప్రసాదరావు, మంత్రి.
ఇవీ చదవండి: