ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత.. కారణం అదే: మంత్రి ధర్మాన - రాష్ట్ర ప్రభుత్వంపై ‌ప్రజల్లో వ్యతిరేకత

MINISTER DHARMANA : మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ‌ప్రజల్లో వ్యతిరేకత ఉందని శ్రీకాకుళం జిల్లాలోని గడప గడప కార్యక్రమంలో ప్రస్తావించారు. అయితే దానికి ప్రజలు సంస్కరణలు అర్థం చేసుకోకపోవడం వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని వెల్లడించారు.

MINISTER DHARMANA
MINISTER DHARMANA

By

Published : Nov 8, 2022, 5:10 PM IST

MINISTER DHARMANA : వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణల వలనే.. ప్రజల్లో వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం పీఎన్ కాలనీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్న మాటలో వాస్తవం లేదన్న ధర్మాన.. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగిందన్నారు. విశాఖపట్నమే ఏకైక రాజధాని అని.. కర్నూలు, అమరావతిలో ఆ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా ప్రస్తుతం పరిపాలనలు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నమేనన్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో రహదారులపై ఏర్పడిన కన్నాలే ఇప్పుడు పెద్దవై ఉంటాయన్నారు.

మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.. అదే కారణం

ABOUT THE AUTHOR

...view details