ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాములమ్మ సైకిల్​కే ఓటు వేస్తానంటోంది.. ఆమెకు సర్ది చెప్పాలన్న మంత్రి ధర్మాన

Dharmana Comments on chandrababu: సైకిల్​ గుర్తుకే ఓటు వేస్తానన్న రాములమ్మ వ్యాఖ్యలపై మంత్రి ధర్మాన స్పందించారు. చంద్రబాబే తనకు ఓటేయొద్దని చెప్తుంటే.. రాములమ్మ లాంటి వాళ్లు ఎలా వేస్తారన్నారు. టీడీపీకి ఓటు వేస్తే.. జగన్​కు వేసినట్లు పలువురు భావిస్తున్నారని.. అలాంటి వారికి వివరించి చెప్పాలని పార్టీ నేతలకు ధర్మాన సూచించారు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయనని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ధర్మాన తెలిపారు.

Dharmana Prasada Rao
మంత్రి ధర్మాన ప్రసాదరావు

By

Published : Jan 3, 2023, 7:53 PM IST

Minister Dharmana Prasada Rao: శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పింగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబే ఓటేయొద్దని చెప్తుంటే.. సైకిల్​కు ఎవరు ఓటు వేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఓ మహిళ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. తమ పార్టీకి ఓటు వేయొద్దంటూ స్వయంగా చంద్రబాబు తెలిపారని.. అలాంటిది రాములమ్మ(చిన్నమ్మ) లాంటి వారు సైకిల్ గుర్తుకు వేస్తామంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆమె దృష్టిలో సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే జగన్​కు ఓటు వేసినట్లు అనుకుంటుందనీ,.. అలాంటి వారికి మన పార్టీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని ధర్మాన తెలిపారు. మహిళలకు వైసీపీలో సమానమైన ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జగన్​తో చెప్పినట్లు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అయితే, సీఎం జగన్ తన అభిప్రాయాన్ని మార్చుకోమని చెప్పడంతో ఈ అంశంపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

'ఆడవాళ్లకు ఆడవాళ్లు చెబితేనే అర్థమవుతుంది. ఇక్కడ రాములమ్మ (చిన్నమ్మ) అనే మహిళ అన్నటువంటి అంశంపై మాట్లాడాలి. ఆమె వైసీపీ కాకుండా టీడీపీ(సైకిల్)కు ఓటు వేస్తానంటుంది. ఆమె దృష్టిలో సైకిల్​కు ఓటువేయడం అంటే జగన్​కు ఓటువేయడమే అని అర్థం. అలాంటి వారికి మన కార్యకర్తలు అవగాహన కల్పించాలి. ప్రతి వార్డులో కార్యకర్తలు తిరిగి అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. గతంలో ఓ సభలో పాల్గొన్న చంద్రబాబు.. సైకిల్ పోవాలని అన్నారు. ఆయనే సైకిల్ పోవాలి అని అనుకుంటున్నారు. రాములమ్మ లాంటి వారికి మనం అవగాహన కల్పించాలి. అప్పుడే మనకు కావాల్సిన లక్ష్యాలను సాధిస్తాం.'- ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details