MINISTER DHRAMANA ON CAPITAL : రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి.. అమరావతిని రాజధాని చేస్తే.. విశాఖను ప్రత్యేక రాష్ట్రంగా చేయ్యాలని అడుగుతామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో సీసీ రహదారిని ప్రారంభించిన మంత్రి ధర్మాన.. తమ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదన్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఒక పైసా తీసుకున్నా రాజీనామా చేస్తానని ఎన్నోసార్లు చెప్పానన్న ధర్మాన.. చంద్రబాబు బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు.
టీడీపీ గెలిచి అమరావతిని రాజధాని చేస్తే.. విశాఖను ప్రత్యేక రాష్ట్రంగా కోరతాం: ధర్మాన - అమరావతి రాజధాని
MINISTER DHARMANA COMMENTS : ఉత్తరాంధ్ర ప్రజల కోసం గొంతెత్తడం ఆపనని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఉత్తరాంధ్రకు అధికార పార్టీ అన్యాయం చేసినా ఊరుకోనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి అమరావతిని రాజధాని చేస్తే.. విశాఖను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరతామన్నారు.
MINISTER DHARMANA COMMENTS
ఉత్తరాంధ్ర ప్రజల కోసం గొంతు ఎత్తడం ఆపను. అవసరమైతే ఎమ్మెల్యే, మంత్రి పదవిని వదిలేస్తా. తప్పు జరిగితే ఎవరినైనా నిలదీస్తా.. అధికార పార్టీ అన్యాయం చేసినా ఊరుకోను. ఇది సైకో ప్రభుత్వం అని అనడం శోచనీయం. -ధర్మాన ప్రసాదరావు, మంత్రి
ఇవీ చదవండి: