Dharmana Prasada Rao: విశాఖకు రాజధానిగా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోరాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సన్ రైజ్ పంక్షన్ హాల్లో విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మద్దతుగా నిర్వహించిన ఈ సమావేశంలో మేధావులు, ఉద్యోగులతో కలిసి మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశమయ్యారు. ఏపీలో విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరమన్న ధర్మాన.. అందుకే దీనిని ఎంచుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వలన విశాఖకు రాజధానిగా అవకాశం వచ్చిందని.. వచ్చిన అవకాశాన్ని వద్దని చెప్పిన వాళ్ళను ద్రోహులుగా చూడాలన్నారు. హక్కులు కాపాడుకునేందుకు కలిసికట్టుగా పని చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.
విశాఖ రాజధాని వద్దన్న వారిని దోషులుగా చూడాలి: మంత్రి ధర్మాన - Vishaka
Dharmana Prasada Rao: విశాఖ రాజధాని ఏర్పాటు చేయటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవటం వల్ల వచ్చిన ఈ అవకాశాన్ని వద్దన్న వారిని దోషులుగా చూడాలని ఆయన అన్నారు.
Etv Bharat