రాష్ట్రంలో 108, 104 అత్యాధునిక అంబులెన్సులను ఒకేసారి ప్రారంభించడం.. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబులెన్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ నివాస్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు.
నూతన 104, 108 వాహనాలను ప్రారంభించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం జిల్లాకు నూతనంగా కేటాయించిన 108,104 వాహనాలను మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో అంబులెన్సులను ప్రారంభించడం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
నూతన 104, 108 వాహనాలను ప్రారంభించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్
108, 104 అంబులెస్సులను పరిశీలించిన మంత్రి కృష్ణదాస్.. పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రజారోగ్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారన్న ఆయన.. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 1088 అంబులెన్సులను ప్రారంభించారన్నారు. జిల్లాలో ఒకేసారి 44 వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసుతో తెదేపా నాయకులు రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సరైన పద్దతి కాదని హెచ్చరించారు.