ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా'

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది పాలనలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

Minister Dharmana krishna das tour in narasannapeta YCP rally in srikakulam district
'అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తా'

By

Published : Jun 8, 2020, 6:23 PM IST

రాష్ట్ర ప్రభుత్వం నిజాయతీ పాలన అందిస్తోందని.. అవినీతి జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మంత్రి ధర్మాన.. కేక్ కట్ చేశారు. భవిష్యత్తులో కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. విభేదాలు వీడి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details