వైకాపా నేత ధర్మాన ప్రసాదరావుకు కచ్చితంగా ఉన్నత పదవి వస్తుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కే.మత్స్యలేశంలో పలు అభివృద్ధి పనుల శుంకుస్థాపనకు వచ్చిన మంత్రి... ధర్మాన ప్రసాదరావు త్రికరణ శుద్ధిగల నాయకుడు అని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారన్న మంత్రి.. అన్ని పనులు దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. సోదరుడు(ధర్మాన ప్రసాదరావు)తో కలిసి ఈ ప్రాంత పనులు పూర్తి చేయటానికి చర్యలు చేపడతామని మంత్రి కృష్ణదాస్ పేర్కొన్నారు.
'ధర్మాన ప్రసాదరావుకు ఉన్నత పదవి వస్తుంది' - ధర్మాన ప్రసాదరావు వార్తలు
తన సోదరుడు ధర్మాన ప్రసాదరావుపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశంసలు కురిపించారు. ప్రసాదరావు త్రికరణ శుద్ధిగల నాయకుడు అని అన్నారు. ఆయనతో కలిసి అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
minister dharmana krishna das praises dhrmana prasada rao