తెదేపా అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్లు చూపించారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన... 2050 నాటికి ప్రపంచంలోకెల్లా అతి సుందరమైన రాజధాని కటిస్తానని చెప్పడం హాస్యాస్పదమైనవని అన్నారు. ఇలాంటి అబద్ధాల పేరుతో కాలం గడిపారని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్ ఒకరని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
రాజధాని పేరుతో అవినీతికి పాల్పడ్డారు: మంత్రి ధర్మాన - తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్
తెదేపా అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. అమరావతి ప్రపంచంలోకెల్లా అతి సుందరమైన రాజధాని అంటూ మాయమాటలు చెప్పారని దుయ్యబట్టారు.
minister dharmana krishna das
TAGGED:
రాజధాని అమరావతి వార్తలు