Minister Dharmana: శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగాలవలసలో సోమవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో వాలంటీర్ల పనితీరుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, పొందుతున్న లబ్ధి గురించి ఆయన స్థానికులను ప్రశ్నించగా చాలామంది సరిగ్గా స్పందించలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు పథకాలు అందించడంతో పాటు వాటి వెనుక ఉన్న ప్రభుత్వ ఆశయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని అన్నారు.
"లబ్ధి పొందుతున్న కుటుంబాలకు.. వాటి పేర్లు కూడా తెలియకపోతే ఎలా?" - శ్రీకాకుశం జిల్లా తాజా వార్తలు
Minister Dharmana: ‘ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న కుటుంబాలకు వాటి పేర్లు కూడా తెలియకపోతే ఎలా? అవగాహన కల్పించాలి కదా’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు
సినిమాల్లో మాదిరిగా ఉండదు:లింగాలవలస గ్రామంలో యువత పవన్‌కల్యాణ్ పక్కన తమ ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసుకోగా.. మంత్రి ధర్మాన దాన్ని గమనించి స్పందించారు. ‘పవన్‌కల్యాణ్ రాజకీయ జీవితంలో నడుస్తానంటున్నారు. అది సాధ్యమేనా? రాజకీయాలంటే ఎన్నో ఒడుదొడుకులతో కూడుకున్నది. సినిమా జీవితం వేరు. కానీ కొందరు యువత బ్యానర్లలో సినిమా హీరోల పక్కన పోజులిచ్చి అదే జీవితం అనుకుంటున్నారు. అది వారి అమాయకత్వం. సినిమాల్లో మాదిరిగా నిజజీవితంలో జరగదు’ అని అన్నారు.
ఇవీ చదవండి: