Minister Dharmana: శ్రీకాకుళం నగరంలో గుడివీధి సచివాలయం పరిధిలో 'గడప గడపకు' మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా.. ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అంటుందని... ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం దుర్వినియోగమా అని ప్రశ్నించారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించింది వైఎస్ఆర్ ప్రభుత్వమన్న ధర్మాన... దీని గురించి అవగాహన ప్రజల్లో రావాలన్నారు. గత ప్రభుత్వంలో జిల్లాకు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలన్నారు. మాజీ సీఎం చంద్రబాబు పథకాలపై అవగాహన లేక ఇవన్నీ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్నారన్నారు.
విశాఖనే మన రాజధాని అన్న మంత్రి ధర్మాన... స్పందించని ప్రజలు - Minister Dharmana on Visakha latest updates
Minister Dharmana: శ్రీకాకుళంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వింత పరిస్థితి ఎదురైంది. మూడు రాజధానులకు మద్దతుగా మనమందరమూ గొంతెత్తాలని సభకు వచ్చినవారిని కోరారు. మన రాజధానని నేనంటా.. మీరందరూ విశాఖపట్నం అనాలని కోరాగా... స్పందన రాకపోవడంతో నవ్వుతూనే వారిమీద అసహనం వ్యక్తం చేశారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన
మన రాజధాని విశాఖపట్నం అని ప్రతి ఒక్కరూ గొంతెత్తాలి... నా తనయుడు మన రాజధాని అన్నప్పుడు.. విశాఖపట్నం అని ఎందుకు అనటం లేదని సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు. విశాఖ రాజధాని అయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. 'విశాఖ రాజధాని అని నేను అంటా.. మీరు అనండి' అని చెప్పినా... ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో నవ్వుతూనే వారిమీద అసహనం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: