సంక్షేమ పథకాల్లో అవినీతి లేకుండా పంపిణీ చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. శ్రీకాకుళం రైతుబజార్ సచివాలయ పరిధిలోని 24 డివిజన్‌లో 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై మహిళలను అడిగి తెలుసుకొన్నారు. 17 ఏళ్ల నుంచి తనకు వస్తున్న పింఛన్‌ను ఆపేశారంటూ.. ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పింఛన్ పునరుద్ధరించాలంటూ మంత్రి కాళ్లపై పడింది. వృద్ధురాలికి ఎనిమిది ఇళ్లు ఉండడం వల్లే ఫించన్ రావట్లేదన్న మంత్రి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
'మంత్రి గారు.. నా ఫించన్ ఆపేశారు'.. 'ఎనిమిది ఇళ్లు ఉంటే పెన్షన్ ఎలా వస్తుంది?' - మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజా వార్తలు
వైకాపా సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అవినీతి లేకుండా ప్రజలకు చేరువ చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రైతుబజార్ సచివాలయ పరిధిలోని 24 డివిజన్‌లో మంత్రి పర్యటించారు.
'మంత్రి గారు.. నా ఫించన్ ఆపేశారు'