మంత్రి సిరిది అప్పలరాజు కాన్వాయ్ కి పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం జోడుబంజర గ్రామం వద్ద కాన్వాయ్ లోని ఓ వాహనం అదుపుతప్పి.. పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. రుషింగి గ్రామంలో దసరా సంబరాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.
పొలాల్లోకి దూసుకెళ్లిన మంత్రి కాన్వాయ్.. తప్పిన ప్రమాదం..
మంత్రి సిరిది అప్పలరాజు కాన్వాయ్ లోని ఓ వాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం జోడుబంజర గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పొలాల్లోకి దూసుకెళ్లిన మంత్రి కాన్వాయ్ వాహనం...తప్పిన ప్రమాదం...
జోడు బంజర గ్రామం వద్ద మలుపు తిరిగే క్రమంలో.. వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంత్రి పీఏ, అనుచరులకు స్వల్పగాయాలయ్యాయి. ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సహాయంతో వాహనాన్ని రహదారిపైకి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి : SUICIDE: సముద్రతీరంలో యువతి ఆత్మహత్య..!