Minister appalaraju: రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడుకు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఆదివారం తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి.. తానూ తాగేసింది. కుటుంబీకులతో పాటు గ్రామస్థులు బాధితులను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న మంత్రి.. ఆసుపత్రికి ఫోన్ చేసి తక్షణమే చికిత్స అందించాలని కోరారు. అనంతరం తానూ ఆసుపత్రికి చేరుకుని స్టెతస్కోప్ తీసుకుని బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. అప్పలరాజు స్వతహాగా వైద్యుడు. రాజకీయాల్లోకి రాకముందు పలాసలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని నిర్వహించేవారు.
Minister Appalaraju: పలాస ఆస్పత్రిలో వైద్యం చేసిన మంత్రి అప్పలరాజు - మహిళకు వైద్యం చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు
Minister appalaraju: రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వాసుపత్రిలో.. ఓ మహిళకు వైద్యం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబసభ్యులు వారిని ఆసుపత్రికి తరలించగా.. మహిళకు మంత్రి వైద్యం చేశారు.
వైద్యం చేసిన మంత్రి అప్పలరాజు