శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు.. వాలంటీర్ లోకేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం తరఫున ఏ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగిందో.. ఆ జాబితాను వాలంటీర్లు సిద్ధం చేశారు. కాగా రేణుక బెహర అనే మహిళ ఇంటికి వెళ్లేసరికి వాలంటీర్ సిద్ధం చేసిన జాబితాలో ఆమె పేరు కనిపించ లేదు. వెంటనే వాలంటీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. 'ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చారంటూ' మండిపడ్డారు. అలాగే తెలుగుదేశం నాయకులు ఏదైనా కార్యక్రమం చేయడానికి వస్తే ప్రజలు వెళ్తున్నారని.. నువ్వు ఏం చేస్తున్నావని వాలంటీర్‌పై కన్నెర్రజేశారు.
నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు..? వాలంటీర్‌పై మంత్రి ఫైర్ - శ్రీకాకుశం జిల్లా వార్తలు
Minister Appalaraju fire on Volunteer: శ్రీకాకుళం జిల్లా రెంటికోటలో మంత్రి అప్పలరాజు.. గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ వాలంటీర్‌పై మంత్రి కన్నెర్రజేశారు. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరంటూ మండిపడ్డారు.
![నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు..? వాలంటీర్‌పై మంత్రి ఫైర్ వాలంటీర్‌పై మంత్రి అప్పలరాజు కన్నేర్ర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15312500-343-15312500-1652799645726.jpg)
వాలంటీర్‌పై మంత్రి అప్పలరాజు కన్నేర్ర
Last Updated : May 17, 2022, 9:28 PM IST