రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో.. ఒక్కో హార్బర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఉప్పు గెడ్డపై నిర్మించిన పడపానిపేట-సుంకరపాలెం వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ కొచ్చి, ఎంఓసీఐ, జిల్లా నిధులతో ఈ వంతెన నిర్మించనున్నారు.
ఈ వంతెన నిర్మాణం పూర్తయితే.. సుమారు పది గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జిల్లాలో 1,336 హెక్టార్లలో మత్స్య సంపదను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.