ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

minister appalraju fires on vro's: వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు ఫైర్.. వారి సేవలు అవసరం లేదంటూ ఆగ్రహం - ap latest news

minister appalraju fires on vro's: గృహనిర్మాణ శాఖ పనితీరుపై.. మంత్రి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో అధికారుల సమన్వయ లోపంతో గందరగోళం నెలకొంది. వీఆర్వోల సేవలు నియోజకవర్గంలో అవసరం లేదని మంత్రి అప్పలరాజు ప్రకటించారు. వారిని సస్పెండ్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.

minister appalraju fires on vro's:
వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు ఫైర్

By

Published : Dec 1, 2021, 4:57 PM IST

వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం

minister appalraju fires on vro's: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో అధికారుల సమన్వయ లోపంతో గందరగోళం నెలకొంది. గృహనిర్మాణశాఖ పనితీరుపై మంత్రి అప్పలరాజు సమీక్ష నిర్వహించారు. మంత్రి సమీక్షకు రాకముందు.. వీఆర్వోలను మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్ బయటకు పంపారు. దీనిపై ఆగ్రహించిన వీఆర్వోలు.. నిరసనకు దిగారు. ఇంతలో మంత్రి అక్కడకు రావడంతో.. వీఆర్వోలు ఆయనను అడ్డుకున్నారు. వారిపై మంత్రి మండిపడ్డారు. వీఆర్వోలను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. వీఆర్వోల సేవలు నియోజకవర్గంలో అవసరం లేదని మంత్రి ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details