ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తితిదే డిక్లరేషన్‌పై తెదేపా, భాజపా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు విమర్శించారు. మతపరమైన రాజకీయాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూకుంభకోణాలు బయటపడిన సందర్భంలో, ఆ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మతపరమైన అంశాలు లేవనెత్తుతున్నారని ఆరోపించారు. తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న తిరునామాలే ఆయనకు హిందూమతంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తిరుమల వెళ్లినప్పుడు ప్రశ్నించని చంద్రబాబు... ఇప్పుడు ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు.
ఆ నామాలే హిందూ మతంపై జగన్ నమ్మకానికి నిదర్శనం: మంత్రి అప్పలరాజు - చంద్రబాబుపై సీదిరి అప్పలరాజు కామెంట్స్
ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తిరుమల వెళ్లినప్పుడు ప్రశ్నించని చంద్రబాబు, భాజపా నేతలు ఇప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారని మంత్రి అప్పలరాజు నిలదీశారు. మతపరమైన రాజకీయాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పెట్టుకున్న తిరునామాలే ఆయనకు హిందూమతంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
అప్పలరాజు