ఎలాంటి రవాణా సౌకర్యం లేని కారణంగా... కాలినే నమ్ముకొని స్వస్థలానికి బయలుదేరినట్లు వలస కూలీలు వాపోతున్నారు. తినడానికి తిండి లేక పస్తులతో పడుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు లేక విజయవాడ నుంచి ఒడిశాకు చెందిన వలస కార్మికులు కాలి బాట పట్టామన్నారు. పర్లాకిమిడికి చెందిన వీరు... దాతలు ఇచ్చిన భోజనం, మంచి నీళ్లు, మజ్జిగను తీసుకుంటూ.. నడుచుకుంటూ వచ్చామన్నారు.