ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి లేదు.. తిండి లేదు.. స్వస్థలాలకు వెళ్తాం..!

లాక్​డౌన్​తో పనుల్లేక... సొంత రాష్ట్రాలకు వెళ్లే మార్గం లేక చిక్కుకున్న వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం వేల కిలోమీటర్లు దాటొచ్చి ఇప్పుడు తినేందుకు గుప్పెడు మెతుకులు దొరక్క కష్టాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్​ పాలిషింగ్​ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు తమను సొంత రాష్ట్రాలకు పంపించాలని అధికారులను వేడుకుంటున్నారు.

స్వరాష్ట్రాలకు పంపించాలంటూ ఆందోళన చేపట్టిన వలసదారులు
స్వరాష్ట్రాలకు పంపించాలంటూ ఆందోళన చేపట్టిన వలసదారులు

By

Published : May 4, 2020, 7:50 PM IST

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ కూడలిలో ఉన్న గ్రానైట్​ పాలిషింగ్ పరిశ్రమలో ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 403 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్​డౌన్​తో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలరోజులుగా చేసేందుకు పని లేక.. తినడానికి సరైన తిండి లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించి తమను సొంత రాష్ట్రాలకు తరలించాలని వేడుకుంటున్నారు. దీనిపై స్పందించిన స్థానిక అధికారులు వారికి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వరాష్ట్రాలకు తరలిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details