కడుపు నింపుకోవడానికి...కుటుంబాన్ని పోషించుకోవడానికి...కానరాని ప్రాంతాలకు వలస వచ్చిన కూలీల అవస్థలు అన్ని ఇన్నీ కావు. రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ కడుపు నిండని వలస కూలీలు... కరోనా దెబ్బకు ఇంటి బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్లో చిక్కుకున్న వలస కూలీలు వందలాదిగా ఒడిశాలోని తమ ప్రాంతాలకు వివిధ మార్గాలలో ఇంటికి చేరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారి టోల్ ప్లాజా మీదుగా ఒడిశాకు ప్రయాణం చేస్తున్నారు.
బతుకు బండిలో..వలస కూలీల వ్యథ - ఇచ్చాపురంలో వలసకూలీల వార్తలు
పొట్టకూటికై పొరుగు రాష్ట్రాలు వచ్చి లాక్డౌన్ వల్ల వలస కూలీల నానా అవస్థలు పడుతున్నారు. ఆకలి తీర్చుకోలేక.. కనికరించే నాథుడే లేక...కాలినడకన వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. వ్యయప్రయాసలకోర్చి సొంతరాష్ట్రాలకు వెళుతుంటే...మధ్యలో ఆకలితో మరణించినవారెందరో! వలస కూలీలు వందలాదిగా ఒడిశాలోని తమ ప్రాంతాలకు వివిధ మార్గాలలో ఇంటికి చేరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారి టోల్ ప్లాజా మీదుగా ఒడిశాకు ప్రయాణం చేస్తున్నారు.
ఇచ్చాపురంలో వలసకూలీల ప్రయాణం