ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'23 రోజులుగా క్వారంటైన్​లో ఉన్నాం.. ఇంకెప్పుడు విడిచి పెడతారు?' - migrant laborers agitation at quarantine center

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కె.కొత్తూరు సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం వద్ద వలస కూలీలు ఆందోళనకు దిగారు. తాము కేంద్రానికి వచ్చి 23 రోజులు దాటినా విడిచిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

migrant laborers agitation at quarantine center
క్వారంటైన్ కేంద్రం వద్ద వలస కూలీల ఆందోళన

By

Published : Jun 15, 2020, 5:10 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కె.కొత్తూరు సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం వద్ద వలస కూలీలు ఆందోళన చేశారు. తాము కేంద్రానికి వచ్చి 23 రోజులు దాటినా విడిచిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత గడువు దాటిందని బ్యాగులు సర్దుకుని వారి సొంత గ్రామాలకు బయలుదేరారు.

పోలీసులు, రెవెన్యూ అధికారులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కేంద్రంలో వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న కారణంగా.. మిగిలిన వారి నుంచి 2 సార్లు నమూనాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాలని, ఫలితాలు వచ్చిన వెంటనే విడిచి పెడతామని సముదాయించారు. టెక్కలి తహసీల్దార్ కె.శ్రీరాములు, రెండో ఎస్సై గోపాలరావు కేంద్రానికి చేరుకుని వలస కూలీలను నిరోధించారు.

ABOUT THE AUTHOR

...view details