పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న కార్మికులు ధర్నా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎంఆర్సీ కార్యాలయం వద్ద వంట నిర్వాహకులు శుక్రవారం నిరసన తెలిపారు. తమకు వేతన బకాయిలు చెల్లించాలని, కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన తమకు 7500 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని సీఐటీయూ ప్రతినిధి చలపతి రావు ఆధ్వర్యంలో వంట నిర్వాహకులు తమ నిరసన తెలియజేశారు.
మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల ధర్నా - cooking workers dharna latest news
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎంఆర్సీ కార్యాలయం వద్ద పాఠశాలల్లో మధ్యాహ్నం వంట చేసే కార్మికులు ధర్నా చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
![మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల ధర్నా midday meals cooking workers dharna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7777088-458-7777088-1593160198628.jpg)
సీఐటీయూ ఆధ్వర్యంలో వంట కార్మికుల ధర్నా