శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనా కాలానికి వేతనాలు వెంటనే చెల్లించి.. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా - శ్రీకాకుళం వార్తలు
కరోనా సమయంలో నిలిచిపోయిన చెల్లింపులు వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో భోజన పథకం కార్మికుల ధర్నా
పెండింగ్‌లో ఉన్న చిక్కీల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించవద్దన్నారు. కనీస వేతనాలను అమలు చేసి.. ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు సూచించారు.