శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో మూతపడిన మెట్కోర్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమను తెరిపించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కార్మికులు కోరారు. కార్మికులంతా విశాఖలో ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లుగా పరిశ్రమ లాక్‌ఔట్ ప్రకటించి నేటి వరకూ తెరవకుండా కార్మికుల పొట్ట కొట్టిందని శివశంకర్ వద్ద వాపోయారు.
ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 500 కుటుంబాల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ చూపాలని కార్మికులు కోరారు. వీరి వెంట జనసేన టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ కణితి కిరణ్ ఉన్నారు.