శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలంగి గ్రామంలో ఇద్దరు వలస కూలీల వివాదం హత్యకు దారితీసింది. కాకినాడకు చెందిన ప్రసాద్, రంగడు అనే ఇద్దరు అవలింగి గ్రామంలో ఒకే ఇంట్లో అద్దెకుంటున్నారు. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లిన వీరిద్దరూ రెండు రోజుల క్రితం కాకినాడ నుంచి వచ్చారు . మద్యం మత్తులో పరస్పరం గొడవ పడ్డారు. వీరితో పాటు గ్రామానికి చెందిన మరికొందరు కలసి గురువారం రాత్రి మద్యం సేవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రంగడు మంచం కోడు తీసుకొని ప్రసాద్ తలపై మోదాడు . దీంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గ్రామ శివారులో పూడ్చి పెట్టాడు. విషయం శుక్రవారం బయటకు పొక్కింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పాతపట్నం సీఐ రవి ప్రసాద్ తెలిపారు.
హత్య చేసి పూడ్చి పెట్టాడు .. కానీ.. - సావరకోటలో వ్యక్తి హత్య
ఇద్దరూ ఒకేచోట పని చేస్తున్నారు. ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మద్యం మత్తులో చిన్న గొడవ జరగడంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందాడు. గుట్టు చప్పుడు కాకుండా అతణ్ని పూడ్చి పెట్టాడు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హత్య చేసి పూడ్చి పెట్టాడు .. కానీ..