విధి ఓ రెండు ప్రాణాలను ‘గాలి’లో కలిపేసింది. ట్రాక్టరు టైరుకు గాలి కొడుతుండగా హఠాత్తుగా ట్యూబ్ పేలిపోయి ఇద్దరు ప్రాణాలు తీసేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొమనాపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి దుర్ఘటన చోటు చేసుకుంది. కొమనాపల్లి కూడలి వద్ద ట్రాక్టరు టైరుకు గాలికొడుతుండగా అది పేలిపోయింది. దీంతో దాసరి సూర్యనారాయణ(52), బొమ్మాళి గోవింద(45) మృతి చెందారు. దాసరి సూర్యనారాయణ ముప్పై ఏళ్లుగా ఇక్కడ పాన్‌షాపుతోపాటు సైకిళ్లకు మరమ్మతు చేయడం, వాహనాలకు గాలికొట్టడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఆదివారం రాత్రి దుకాణం మూసే సమయంలో తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద ట్రాక్టరు టైరు తీసుకువచ్చి మరమ్మతు చేయమని కోరారు. మరమ్మతు పూర్తి చేసి గాలి కొడుతున్న సమయంలో అది పేలిపోయింది. దాంతో వారిద్దరు పది అడుగులు పైకి ఎగిరిపడ్డారు. ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, తీవ్రగాయాల పాలైన గోవిందను 108 సహాయంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సూర్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గోవిందకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గాలికొడుతుండగా పేలిన టైరు: ఇద్దరు మృతి - kommanapally tyre burst news
ట్రాక్టర్ టైరుకు గాలి నింపుతుండగా అది పేలడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.మృతులు దాసరి సూర్యనారాయణ(52), బొమ్మాళి గోవింద(45) గా గుర్తించారు.
గాలి నింపుతుండగా టైరు పేలి ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
Last Updated : Mar 1, 2021, 7:38 AM IST