Mandal Tahsildar office in dilapidated state: శ్రీకాకుళం జిల్లా మొలియాపుట్టి మండల తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది, పైకప్పు పెచ్చులు ఊడిపోతుండడంతో ఇనుప ఊచలు బయటకు తేలి భయపెడుతున్నాయి, గోడలు, స్తంభాలకు పగుళ్లు ఏర్పడి ఎక్కడికక్కడ ఊడుతున్నాయి, కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పనుల నిమిత్తం వచ్చే స్థానికులు సైతం ఎప్పుడు ఈ ప్రమాదం జరుగుతుందోనని బెంబేలెత్తుతున్నారు, కార్యాలయం జీవిత కాలం మగిసినా ఇంకా అందులోనే కొనసాగించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని నూతన కార్యాలయాన్ని నిర్మించాలని అధికారులు,స్థానికులు కోరుతున్నారు.
శిథిలావస్థవలో మొలియాపుట్టి మండల తహసీల్దార్ కార్యాలయం - Problems IN MRO offices
Mandal Tahsildar office in dilapidated state: ప్రభుత్వ కార్యాలయాలు పాడవుతున్న అధికారులు పట్టించుకోవట్లేదు కార్యాలయాల్లో పని చేసే అధికారులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో అధికారులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
![శిథిలావస్థవలో మొలియాపుట్టి మండల తహసీల్దార్ కార్యాలయం Tahsildar office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17382942-17-17382942-1672727181203.jpg)
తహసీల్దార్ కార్యాలయం
శిథిలావస్థవలో ఉన్న మొలియాపుట్టి మండల తహసీల్దార్ కార్యాలయం