ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి: జేసీ సుమిత్‌కుమార్ - మెగా రక్తదాన శిబిరం

ఒకరు రక్తదానం చేయడం వలన ఇద్దరి ప్రాణాలు కాపాడవచ్చని.. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని శ్రీకాకుళం జిల్లా జేసీ సుమిత్‌కుమార్ అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

blood donation camp inaugurated by jc summit Kumar
మెగా రక్తదాన శిబిరం

By

Published : Apr 4, 2021, 9:23 PM IST

రక్తదానం చేసేందుకు యువత ముందుకురావాలని శ్రీకాకుళం జిల్లా జేసీ సుమిత్‌కుమార్ అన్నారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అవసరమైన రక్తనిల్వలు లేవని అన్నారు. యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదాన కార్యక్రమానికి గ్రామ, వార్డు వాలంటీర్లు ముందుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details