తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం - ఫొని తుపాను
ఫొని తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో... అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తహసీల్దార్ అంబేద్కర్ ఆదేశించారు.
ఫొని తుపాను హెచ్చరికలపై ముందస్తు సమావేశం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పట్టణంలో మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఫొని తుపానుపై ముందస్తు సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ... సమస్యలు పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ సరఫరా, రహదారిపై వచ్చే అడ్డంకులు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.