ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిక్కోలులో ఘనంగా మే డే వేడుకలు

శ్రీకాకుళం జిల్లాలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మిక కర్షకులు ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు కృషి చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

సిక్కోలులో ఘనంగా మే డే వేడుకలు

By

Published : May 1, 2019, 2:18 PM IST

తాను అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలను పార్లమెంట్​లో ప్రస్తావిస్తానని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యనించారు. నరసన్నపేటలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్మికులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికసంఘాల నాయకులు, నేతలు పాల్గొన్నారు.

సిక్కోలులో ఘనంగా మే డే వేడుకలు

పలాస నియోజకవర్గంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో పలు కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించారు. రహదారిపై మానవహారం నిర్వహించి కార్మికసంఘాలు ఐక్యంగా ఉండాలంటూ నినదాలు చేశారు. అనంతరం కార్మిక సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు.

సిక్కోలులో ఘనంగా మే డే వేడుకలు

ABOUT THE AUTHOR

...view details