ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కుల పంపిణీకి చర్యలు వేగవంతం - masks distribution news in srikakulam district

శ్రీకాకుళం జిల్లాలో మాస్కుల పంపిణీకి చర్యలు వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో... జిల్లాలోని సుమారు 26 లక్షల మందికి 3 మాస్కుల చొప్పున అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో మాస్కుల తయారికి ఆదేశాలు జారీ చేశారు.

మాస్కుల పంపిణీకి చర్యలు వేగవంతం
మాస్కుల పంపిణీకి చర్యలు వేగవంతం

By

Published : May 10, 2020, 9:12 AM IST

కరోనా మహమ్మారి ఎప్పుడు ఎలా చుట్టుముడుతుందో తెలియదు. నిన్న మొన్నటివరకు కరోనా రహితంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున అందజేయాలని సిక్కోలు యంత్రాంగం నిర్ణయించింది. ఈమేరకు మెప్మా, డీఆర్‌డీఏ అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి తద్వారా చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ప్రజలందరికీ లక్షల కొద్దీ మాస్కులు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. మాస్కుల తయారీని పట్టణ పరిధిలో మెప్మా.... గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి డీఆర్‌డీఏ పర్యవేక్షిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పట్టణాల్లో పురపాలక సంఘాల కమిషనర్లకు మండలాల పరిధిలో ఎంపీడీవోలకు మాస్కులు పంపిణీ చేస్తున్నారు. వీటిని వాలంటీర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత అప్పగించారు. జిల్లాలో ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన స్వయం శక్తి సంఘాల మహిళలు మాస్కులను తయారు చేస్తున్నారు. మాస్కులు వేసుకోకుండా బయట తిరుగిన వారికి రూ.1000 జరిమానా కట్టాల్సి ఉంటుందని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: ఇక జిల్లాలోనే కరోనా నిర్ధరణ పరీక్షలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details