శ్రీకాకుళం జిల్లా విభజన జరిగితే జరగబోయే నష్టంపై.. 'మరోసారి విభజన' పేరుతో సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని పలువురు సాహితీవేత్తలు ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎలాంటి విభజన జరిగినా.. ముందుగా బలయ్యేది శ్రీకాకుళం జిల్లానే అని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజయనగరం గిరిజన యూనివర్శిటీ ప్రత్యేక అధికారి హనుమంతు లజపతిరాయ్‌తో పాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.
'మరోసారి విభజన' పుస్తకం ఆవిష్కరణ - 'మరోసారి విభజన' పుస్తకం తాజా వార్తలు
రాష్ట్రంలో ఎలాంటి విభజన జరిగినా ముందుగా బలయ్యేది శ్రీకాకుళం జిల్లానే అని... విజయనగరం గిరిజన యూనివర్శిటీ ప్రత్యేక అధికారి హనుమంతు లజపతిరాయ్ అన్నారు. 'మరోసారి విభజన' పేరుతో... సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'మరోసారి విభజన' పుస్తకం ఆవిష్కరణ