శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మార్కెట్, చింతాడ వారంతపు సంత వేలం పాటలు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం అధికారులు నిర్వహించారు. రోజువారి మార్కెట్‌ను బలివాడ అనసూయమ్మ రూ.13,50,000లకు బహిరంగ వేలం పాటలో ఖరారైంది. అలాగే రూ.4,68,000 స్వీపర్ చార్జీలను వేలం పాటకు అనుగుణంగా జమ చేశారు.
చింతాడ వారంతపు సంత వేలం పాటను గుండ లక్ష్మణరావు రూ.7,05,000లకు దక్కించుకున్నారు. స్వీపర్ చార్జీలను రూ.5,14,800 స్వీపర్ చార్జీలను వేలం పాటకు అనుగుణంగా జమ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు గుత్తేదారులు పాల్గొన్నారు.