శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాల్లో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు మామిడికాయలు రాలిపోయాయి. పంట నేల రాలడంపై... రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అంతంత మాత్రమే ఉన్న పంట ఇప్పుడు ఈదురు గాలులకు చేతికందకుండా పోయిందని ఆవేదన చెందారు. ఏం చేయాలో పాలుపోవట్లేదని కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యమన్నారు.
రాలిన కాయలు... కూలిన ఆశలు - mango crop loss due to rain
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజవర్గంలో కురిసిన అకాల వర్షానికి మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిన్న సాయంత్రం ఈదురుగాలులతో పడిన వానకు తోటల్లో కాయలు రాలిపోయాయి.
మామిడి పంట నష్టం