శ్రీకాకుళం జిల్లా భామిని మండలం దిమిలి జోల గ్రామ సమీపంలోని అనంతగిరి తోటలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. బుధవారం అటుగా వెళ్లిన గ్రామస్థులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కళ్లు పీకి వ్యక్తి దారుణ హత్య..
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం దిమిలి జోల గ్రామంలో ఓ వ్యక్తిని కళ్లుపీకి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
man killed at srikakulam district bhamini
హత్యకు గురైన వ్యక్తి కొత్తూరుకు చెందిన బిడ్డిక రవిగా పోలీసులు గుర్తించారు. రవికి రెండు కళ్లు పీకేసి అత్యంత కిరాతకంగా దుండగులు హత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి కొత్తూరు సీఐ మజ్జి చంద్రశేఖర్ చేరుకుని ఆరా తీస్తున్నారు. మృతుడు శుభకార్యాలకు వంట చేసేందుకు సహాయకుడిగా వెళ్తాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తెదేపా గెలుస్తుందంటావా?