ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

Man killed in unidentified vehicle collision at ichapuram srikakulam district
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

By

Published : Feb 7, 2021, 10:06 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపల్ పరిధిలో ప్రమాదం జరిగి.. ఓ వ్యక్తి మృతి చెందాడు. బేళ్లు పడా గ్రామానికి చెందిన నీలపు జోగయ్య.. లొద్దపుట్టి వద్ద ధనరాజ్ తులసమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.

జాతీయ రహదారి స్కై డ్రాప్ కూడలి సమీపంలో అతడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో జోగయ్య బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. జోగయ్య మృతి ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది.

ABOUT THE AUTHOR

...view details