ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత కక్షలతో.. నాటు తుపాకితో కాల్చాడు! - వ్యక్తిపై నాటు తుపాకితో దాడి

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెంట గ్రామంలో నాటు తుపాకి కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.

man attack with local gun

By

Published : Oct 22, 2019, 9:31 AM IST

Updated : Oct 23, 2019, 12:28 PM IST

శ్రీకాకుళం జిల్లా వీఆర్ పేట సమీపంలో కాల్పుల కలకలం నెలకొంది. పెంట గ్రామానికి చెందిన జీవీ రమణ అనే వ్యక్తి రాజాం నుంచి అగ్రహారానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఆయనపై బత్తుల మధు అనే వ్యక్తి.. దాడి చేశాడు. అడవి పందులను వేటాడే నాటు తుపాకితో మోకాళ్లపై కాల్పులు జరిపినట్లు బాధితుడు ఆరోపించాడు. గాయపడిన రమణను స్థానికులు రాజాం పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 23, 2019, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details