ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహేతర సంబంధం.. రెండు ప్రాణాలు బలి - శ్రీకాకుళం వార్తలు

వివాహేతర సంబంధం రెండు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. ఇద్దరు పిల్లలకు తల్లిని, రెండు నెలల పసివాడికి తండ్రిని దూరం చేసింది. కూలీ పనులు చేసుకుంటూ బతికే వారి జీవితాలను బలి తీసుకుంది. దొరికిన పని చేసుకుంటూ కట్టుకున్న వ్యక్తితో అనందంగా జీవించాల్సిన వారు, తప్పు చేయడానికి అలవాటు పడ్డారు. అయిన వారితో బతకలేక.. వివాహేతర సంబంధం వదులుకోలేక.. చెట్టుకు ఉరి వేసుకుని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పిట్టలసరియాలో జరిగింది.

man and women suicide
ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

By

Published : Jan 16, 2021, 7:07 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పిట్టలసరియాలో మహిళ, ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు గ్రామానికి చెందిన ఇప్పిలి రమేష్, వేణమ్మ అని పోలీసులు తెలిపారు. వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని తెలిపారు.

అసలేం జరిగింది..?

వేణమ్మకు 14ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్​కు కూడా ఏడాదిన్నర కిందట వివాహం జరగ్గా, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. రెండు కుటుంబాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. రెండేళ్లుగా రమేష్, వేణమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు వారిని పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రెండు కుటుంబాల్లో తగాదాలు తలెత్తాయి.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన వీరిద్దరూ ఊరి చివర మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో టెక్కలి ఎస్సై కామేశ్వర రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్​తో ఆధారాలు సేకరించారు. గ్రామస్థులు తెలిపిన విషయాల ప్రకారం వారి మృతికి వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రోడ్డుపై ఆటో పెట్టాడని ఘర్షణ...దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details