ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Arrest: రాజాం పోలీసులకు చిక్కిన మహిళా దొంగల ముఠా

వారంతా చూసేందుకు సాధారణ మహిళలలాగే కనిపిస్తారు... చూడటానికి 45-60 సంవత్సరాల వయసు ఉంటుంది. కారులో వచ్చి దర్పం ప్రదర్శిస్తారు. కళ్ళు మూసి తెరిచేలోగా ఇట్టే సొత్తును తస్కరిస్తారు. ఇలా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పలు మోసాలకు పాల్పడి బంగారం దోచుకుంటున్న మహిళా దొంగల ముఠాను రాజాం పోలీసులు పట్టుకున్నారు.

By

Published : Aug 3, 2021, 2:16 PM IST

arrest
arrest

విశాఖపట్నం-రాజాం ప్రధాన రహదారి గారాచీపురుపల్లి కూడలి వద్ద ఎస్ఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారు దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అనుమానం వచ్చి ఆ కారును ఆపి అందులో ఉన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అనుమానితులుగా గుర్తించి విచారణ చేపట్టారు.

కారులోని మహిళలు కృష్ణా, ఖమ్మం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి బంగారు దుకాణాల్లో నగదు తస్కరించడం పనిగా పెట్టుకున్నారు. జూలై 27న పాలకొండ, ఆమదాలవలస, రాజాంలోను.. జూలై 29న పలాసలో బంగారు దుకాణాల్లో బంగారం దొంగిలించినట్లు విచారణలో తెలిసింది.

వారి దగ్గరి నుంచి 41 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిపై తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాలో కేసులు ఉన్నట్లు గుర్తించామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చదవండి:

father killed son: కోడలితో వివాహేతర సంబంధం.. కొడుకును హతమార్చిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details