మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగాడం మండలాల్లోని శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో శివరాత్రి మహోత్సవాలు.. - ఎచ్చెర్లలో శివరాత్రి మహోత్సవాల వార్తలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎచ్చేర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న 4 మండలాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. వేకువజామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో శివరాత్రి మహోత్సవాలు..
లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో శ్రీ ఉమా రామలింగేశ్వర పంచాయతన దేవస్థానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆలయాల వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని.. ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: