కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసిన కందిపప్పు నాణ్యతపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లోని గోపినాథపురం ప్రాంతంలో పంపిణీ చేసిన కందిపప్పు ముక్కిపోయి పురుగులు పట్టిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్యాకింగ్ తెరిచి చూసిన పలువురు పప్పు ఏమాత్రం తినడానికి పనికిరాదని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ వల్ల ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పు, ఒక్కో కుటుంబ సభ్యునికి 5 కిలోల బియ్యం చొప్పున రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
శ్రీకాకుళంలో పేదలకు నాసిరకం కందిపప్పు పంపిణీ - ration distribution in srikakulam update news
లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేసిన కందిపప్పు పురుగులు పట్టిందని తినేందుకు పనికిరాదని జనం ఆరోపిస్తున్నారు.

శ్రీకాకుళంలో పేదలకు నాసిరకం కందిపప్పు పంపిణీ