శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఓ లారీ అదుపుతప్పి వంశధార కాలువలో బోల్తా పడింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఈ లారీ ఆదివారం వేకువజామున అదుపుతప్పి నరసన్నపేట బ్రాంచి కాలువలోకి దూసుకుపోయింది. లారీ సిబ్బంది త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
జాతీయ రహదారిపై లారీ బోల్తా - లారీ బోల్తా
శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిపై ఓ లారీ అదుపు తప్పి కాలువలో బోల్తాపడింది. అదృష్టవశాత్తూ లారీ సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
జాతీయ రహదారిపై లారీ బోల్తా