శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు మహా శివరాత్రి సందర్భంగా.. పెన్సిల్ కొనపై శివలింగంతో పాటు సర్పం, త్రిశూలం చెక్కాడు. స్వర్ణకారుడైన శివనాగ నరసింహాచారి.. వీలు దొరికినప్పుడల్లా సూక్ష్మ కళాఖండాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు.
ఇప్పుడు శివరాత్రి సందర్భంగా పెన్సిల్ కొనపై శివలింగాన్ని రూపొందించినట్టు ఆయన తెలిపారు. కళారూపాలతో ఎన్నో సన్మానాలు, అవార్డులు పొందిన ఆయన.. 2019లో ఇంటర్నేషనల్ యూత్ అవార్డును దిల్లీలో అందుకున్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్నారు. తన కళారూపాలతో ఎగ్జిబిషన్ పెట్టాలనే కోరిక ఉన్నట్లు నరసింహాచారి తెలిపారు.