శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన జాబ్మేళా ప్రారంభోత్సవంలో... రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలపై... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం... అధికారం తెచ్చిన తలపొగరుకి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన ప్రసంగానికి చప్పట్లు కొట్టలేదని... నిరుద్యోగుల కంటే కుక్కలు మేలు అని ఒక మంత్రి అన్నారంటే... రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శించారు.
'నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం... తలపొగరుకి నిదర్శనం' - మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై నారా లోకేశ్
నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి ధర్మాన కృష్ణదాసు చేసిన వ్యాఖ్యలపై... నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం తెచ్చిన తలపొగరుకు ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
నారా లోకేశ్
వైకాపా కార్యకర్తలకు గ్రామవాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి... ఏడాదికి రూ.4వేల కోట్ల ప్రజాధనం దోచేస్తున్నందుకు చప్పట్లు కొట్టాలా అని లోకేశ్ ప్రశ్నించారు. గ్రామసచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పత్రాన్ని లీక్ చేసి... పేపర్ రూ.5లక్షలకు అమ్ముకొని... 19 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసినందుకు చప్పట్లు కొట్టాలా అంటూ నిలదీశారు. ఇదే తరహా పరిపాలన సాగితే... నిరుద్యోగ యువత వైకాపా ప్రభుత్వానికి చావు డప్పు కొట్టడం ఖాయమని ట్వీట్ చేశారు.