ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాతపట్నం పరిధిలో కట్టుదిట్టంగా లాక్​డౌన్​ - శ్రీకాకుళం జిల్లా తాజా లాక్​డౌన్​ విశేషాలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పరిధిలోని గ్రామాల్లో పటిష్టంగా లాక్​డౌన్​ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారుల్లో కర్రలు అడ్డంగా పెట్టి మూసేశారు. ఇతరులెవరూ పాతపట్నం పరిధిలోకి ప్రవేశించకుండా పోలీసుల పహారా కొనసాగుతోంది. కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

lockdown implementing strictly in pathapatnam region villages
పాతపట్నంలో లాక్​డౌన్​ కట్టుదిట్టం

By

Published : Apr 30, 2020, 12:07 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పరిధిలోని గ్రామాల్లో లాక్​డౌన్​ కట్టుదిట్టంగా అమలవుతోంది. మండలంలోని 18 గ్రామాల్లో రెడ్​జోన్​ ప్రాంతాలున్నాయి. మరో 9 గ్రామాల్లో కంటైన్మెంట్​ అమలు జరుగుతుంది. మేజర్​ పంచాయతీ వీధుల్లో ప్రజలు ప్రవేశించకుండా ఉండేందుకు రహదారిపై కర్రలు కట్టారు.

ప్రధాన రహదారిపై సైతం ప్రజలు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి సామాజిక ఆసుపత్రిలో.. స్థానికులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనుమానితంగా ఫలితాలు వచ్చిన వారిని శ్రీకాకుళం జేమ్స్​ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు.

ABOUT THE AUTHOR

...view details