లాక్డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెుదట ప్రభుత్వపాఠశాలలో ఏర్పాటు చేసిన రైతు బజారును రద్దీ దృష్ట్యా...రాజావారి మైదానానికి మార్చారు. దీంతో అక్కడినుంచి కూరగాయలు తరలించడానికి అదనంగా ఖర్చు కావటంతో పాటు రాజావారి మైదానంలో నిలువ నీడలేదని వ్యాపారులు వాపోతున్నారు. దానికి తోడు అమ్కకాలు కూడా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తిరిగి ప్రభుత్వ పాఠశాలలోకి రైతుబజారును తరలించాలని వేడుకొంటున్నారు.
'రైతు బజార్‌ను ప్రభుత్వ పాఠశాలకు తరలించాలి' - శ్రీకాకుళంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూరగాయల వ్యాపారులు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో లాక్డౌన్ కారణంగా కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలువ నీడలేని మైదానానికి రైతుబజారును తరలించటంతో అమ్మకాలు లేవని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
!['రైతు బజార్‌ను ప్రభుత్వ పాఠశాలకు తరలించాలి' తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూరగాయల వ్యాపారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6811367-216-6811367-1587021290701.jpg)
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూరగాయల వ్యాపారులు