శ్రీకాకుళంలో ఆదివారం పూర్తిస్థాయి లాక్ డౌన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ నివాస్ తెలిపారు. కాయగూరలు మార్కెట్లు, చికెన్, మటన్, చేపల దుకాణాలూ మూసి ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. శ్రీకాకుళం నగరంలో కేసులు పెరుగుతున్నాయని... వైరస్ వ్యాప్తికి గురికాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
శ్రీకాకుళంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్
కరోనా నేపథ్యంలో శ్రీకాకుళంలో ఆదివారం లాక్డౌన్ అమలు చేయనున్నట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. కాయగూరలు మార్కెట్లు, చికెన్, మటన్, చేపల దుకాణాలూ మూసి ఉంటాయని తెలిపారు.
శ్రీకాకుళంలో 2,400 కేసులు నమోదు కాగా 13,00 యాక్టివ్ కేసులు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. ఈనేపథ్యంలో ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్నారు. లాక్ డౌన్‌కు మొదటి నుంచి ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని... అదే విధంగా జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో వైరస్ వ్యాప్తిని నివారణకు ఆదివారం లాక్ డౌన్‌కు సహకరించి వైరస్ వ్యాప్తి నివారణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: వరద గోదావరి.. తగ్గుతోంది.. ఇంకా నీళ్లలో నానుతున్న గ్రామాలు