కరోనా కేసులు పెరుగుతున్నందున భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు పాలనా యంత్రాంగం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు 15 ప్రాంతాల్లో కేంద్రాలున్నాయి. ఇటీవల మహమ్మారి విస్తరిస్తుండటంతో పలు కేంద్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. షార్‌లో మాత్రం 50 శాతం ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. వారం వ్యవధిలో షార్ ఉద్యోగుల్లో పలువురికి కొవిడ్ నిర్ధారణ కావడంతో ఆదివారం నుంచి లాక్‌డౌన్ అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన సేవలన్నీ నిలిచిపోయాయి. షార్ సిబ్బందితోపాటు వారి కుటుంబీకులందరికీ కలిపి ఇప్పటివరకు 50 మందికిపైగా పాజిటివ్ వచ్చింది.
కరోనా ఎఫెక్ట్: షార్‌లో లాక్‌డౌన్.. ఎప్పటి నుంచి అంటే? - కరోనాతో షార్‌లో లాక్‌డౌన్ న్యూస్
.
![కరోనా ఎఫెక్ట్: షార్‌లో లాక్‌డౌన్.. ఎప్పటి నుంచి అంటే? lock down in sathish dawan space center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8445193-93-8445193-1597612672358.jpg)
lock down in sathish dawan space center