కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మరింత పటిష్టవంతంగా అమలు చేసేందుకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు వాహనాల రాకపోకలు నిలిపేశారు. రోడ్లపై తిరుగుతున్న వారిని నిర్బంధించారు. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లే వారిని మాత్రమే విడిచిపెట్టారు. ద్విచక్ర వాహనాలపై ఆకతాయిగా తిరిగే యువకులపై కొరడా ఝుళిపించారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ముగ్గురు ఎస్ఐలతో కూడిన పోలీస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
'అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లొద్దు'
లాక్డౌన్ ఆంక్షలను మరింత పటిష్టవంతంగా అమలు చేసేందుకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీసులు చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
అత్యవసరమైతే తప్ప బయటకి రావోద్దు